పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్..బియ్యాన్ని కొట్టేశాడంటూ!

by velandi.Saikiran |

వైసీపీ సీనియర్ లీడర్ పేర్ని నానికి ( Perni nani) ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra ) కౌంటర్ ఇచ్చారు. వైసీపీ

పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్..బియ్యాన్ని కొట్టేశాడంటూ!
X

పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్

వైసీపీ నాయకులు బరితెగించారు

రప్పా రప్పా అని పిచ్చి వాగుడు వాగుతున్నారు

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ సీనియర్ లీడర్ పేర్ని నానికి ( Perni nani) ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra ) కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నాయకులు (YCP) బరితెగించారని మండిపడ్డారు. రప్పా రప్పా ( Rappa Rappa) అని పిచ్చి వాగుడు వాగుతున్నారని చురకలు అంటించారు. పేర్ని నాని కామెంట్స్ ను సీరియస్ గా తీసుకుని కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పేదవాడికి పెట్టే బియ్యాన్ని కొట్టేసిన వ్యక్తి పేర్ని నాని అని ఆరోపణలు చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. అలాంటి వ్యక్తులు ఇప్పుడు కూటమి ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక అంతకు ముందు కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు. రెడ్ బుక్ కు దీటుగా రప్పా రప్పా అంటే వాళ్లకు మనకు తేడా ఏంటి? చీకట్లో కన్ను కొడితే పనులు అయిపోవాలి అంటూ బాంబు పేల్చారు.

జగన్మోహన్ రెడ్డి రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యకర్తలకు ఫ్రీ హ్యాండ్ ఉంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు. అప్పటివరకు కార్యకర్తలు ఓపిక పట్టాలని... రప్పా రప్పా బంద్ చేయాలని ఈ సందర్భంగా వెల్లడించారు. దీంతో పేర్ని నాని పై... మచిలీపట్నం టిడిపి నాయకులు కేసు కూడా పెట్టారు.

Next Story