త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: మంత్రి కీలక పిలుపు

by Vemula.Srinu Prasad |

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న వేళ కార్యకర్తలకు మంత్రి కొల్లు రవీంద్ర కీలక పిలుపు నిచ్చారు..

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు:  మంత్రి కీలక పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections) నిర్వహణకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ-సేవ పేరుతో ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులు ఇంటి నుంచే నామినేషన్ దాఖలుకు అవకాశం కల్పిస్తోంది. పోలింగ్ ఫలితాలు సైతం మొబైల్ అప్లికేషన్ల ద్వారా తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ఓటర్ల నమోదు, లిస్టు, పోలింగ్ కేంద్రాలు, అభ్యర్థులు, నామినేషన్ల లిస్టు వంటి అంశాలను కూడా ప్రజలకు తెలిపేందుకు కొత్త సాఫ్ట్ వేర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల ఛాన్స్ ఉందని పలువురు అంటున్నారు.

దీంతో అధికార కూటమి అలర్ట్ అయింది. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయా శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలు, కార్యకర్తలు దిశానిర్దేశం చేశారు. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాలను ప్రజలు గుర్తు పెట్టుకున్నారని, మళ్లీ అధికారం ఇచ్చేందుకు సిద్ధంగా లేరని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.

Next Story