పార్టీ పరిస్థితిపై మంత్రి కొల్లు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

పార్టీ పరిస్థితిపై మంత్రి కొల్లు కీలక వ్యాఖ్యలు చేశారు...

పార్టీ పరిస్థితిపై మంత్రి కొల్లు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. జనసేన(Janasena), బీజేపీ(Bjp)తో కలిసి పాలన సాగిస్తోంది. అయితే ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏంటనే అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ఫోకస్ పెట్టారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత పటిష్టత చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు పార్టీ పరిస్థితి తెలుసుకోవడంతో పాటు పార్టీ బలోపేతం బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఈ మేరకు మంత్రులు జిల్లాలు, గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. పార్లమెంటరీ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతం కోసం చేయాలని పనులను నేతలు, కార్యకర్తలకు వివరిస్తున్నారు.

ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో టీడీపీ పార్లమెంట్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర నిర్మాణం కోసం టీడీపీ శ్రమిస్తోందని తెలిపారు. టీడీపీ సంస్థాగత నిర్మాణం అత్యంత కీలకమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతం లక్ష్యంగా పార్టీ కమిటీల నియామకం చేపడుతున్నామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Next Story