- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మీ నమ్మకం.. ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి’.. మంత్రి ఆసక్తికర ట్వీట్
మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా కందుల దుర్గేష్(Kandula Durgesh) సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా కందుల దుర్గేష్(Kandula Durgesh) సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘నేటితో నేను పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయింది. నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu)కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో నేర్చుకున్న అనుభవాలు, మీ అందరి ఆశీర్వాదం, సహకారం నాకు ఎప్పటికీ మరిచిపోలేనివి. నా పదవీ కాలం ప్రారంభ దశ నుండే ప్రజల ఆశయాలను నిజం చేయడానికి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేందుకు నిస్వార్థంగా అహర్నిశలూ పనిచేస్తున్నాను. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన నా నేతలకి, సహచర మంత్రులకు, అధికార యంత్రాంగానికి, పార్టీ శ్రేణులకు, మీడియా మిత్రులకు మరియు ముఖ్యంగా నన్ను ప్రేమానురాగాలతో ఎంతగానో ఆదరిస్తున్న ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ నమ్మకమే నాకు ప్రేరణ, మీ ఆశీర్వాదమే నాకు బలంగా నిలుస్తోంది. మీరు చూపిన ప్రేమ, విశ్వాసానికి న్యాయం చేయడానికి ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తానని, నిస్వార్థంగా సేవ చేస్తానని ఈ వేదికగా మరొక్కసారి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ట్వీట్






