రుషికొండ ప్యాలెస్‌ను ఎలా ఉపయోగించుకోవాలో తెలియడం లేదు: మంత్రి సెటైర్లు

by Gantepaka Srikanth |

తిరుపతిలో పర్యాటక రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) అన్నారు.

రుషికొండ ప్యాలెస్‌ను ఎలా ఉపయోగించుకోవాలో తెలియడం లేదు: మంత్రి సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలో పర్యాటక రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెల 7, 8వ తేదీలు రెండ్రోజుల్లో తిరుపతిలో పర్యాటక, దేవాదాయ శాఖ సమావేశం ఉండనుందని తెలిపారు. ఆగష్టు 1న గండికోట పర్యాటక ప్రాంత అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) శంకుస్థాపన చేస్తారని చెప్పారు. విశాఖ నుంచి చెన్నై వరకు సముద్ర తీరాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. రుషికొండ ప్యాలెస్‌(Rushikonda Palace)ను ఎలా ఉపయోగించుకోవాలో తెలియడం లేదు.. త్వరలోనే దానిని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. కాగా, వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్‌ నివాసం కోసం విశాఖలోని రుషికొండపై ఈ ప్యాలెస్ నిర్మించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 409.39 కోట్లు ఖర్చు చేసి నిర్మాణం జరిపినట్లు వార్తలు వచ్చాయి.

Next Story