- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దశాబ్దాల కలను పవన్ కల్యాణ్ నెరవేర్చారు: మంత్రి
దశాబ్దాల కలను పవన్ కల్యాణ్ నెరవేర్చారు: మంత్రి

దిశ, వెబ్‌డెస్క్: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేతుల మీదుగా రూ.3050 కోట్ల జల్ జీవన్ మిషన్ నిధులతో చేపట్టనున్న అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం పెరవలిలో ఘనంగా జరిగిందని మంత్రి కందుల దుర్గేశ్(Kandula Durgesh) పేర్కొన్నారు. ఇది ఉభయ గోదావరి జిల్లాల ప్రజల దశాబ్దాల కలకు రూపు దాల్చిన అద్భుత ఘట్టమని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల పరిధిలోని 23 నియోజకవర్గాలు, 66 మండలాల్లో నివసిస్తున్న దాదాపు 68 లక్షల మంది ప్రజలకు ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందుబాటులోకి రానుందని తెలిపారు. ధవళేశ్వరం వద్ద ఆధునిక సాంకేతికతతో నీటిని శుద్ధి చేసి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గ్రావిటీ ద్వారా సరఫరా చేయనున్నామని చెప్పారు.
గోదావరి డెల్టా ప్రాంతంలో భూగర్భ జలాల కలుషితం, ఉప్పునీటి సమస్యల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు ఈ ప్రాజెక్ట్ శాశ్వత పరిష్కారం చూపనుంది. తాగునీటి భద్రత సంక్షేమ పథకం కాదు – అది ప్రజల జీవన హక్కు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి ప్రజలకు అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరుతో ఈ ప్రాజెక్టుకు నామకరణం చేయడం గర్వకారణమని తెలిపారు. ఆయన స్ఫూర్తి ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో మంచి నీటిగా ప్రవహించాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆలోచన అందరికీ ఆదర్శప్రాయమన్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి పెరవలిని వేదికగా ఎంపిక చేసినందుకు పవన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.






