పవన్ ఒక ప్రభంజనం.. మాట ప్రకంపనం: మంత్రి దుర్గేశ్ ప్రశంసలు

by Vemula.Srinu Prasad |

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మంత్రి కందుల దుర్గేశ్ ప్రసంశల వర్షం కురిపించారు..

పవన్ ఒక ప్రభంజనం.. మాట ప్రకంపనం: మంత్రి దుర్గేశ్ ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్ని ఒడిదుడుకులు, అవమానాలు ఎదురైనా అంతిమంగా రికార్డు విజయం సాధించిన పవన్ ప్రజాసేవలో తనదైన ముద్ర వేస్తున్నారన్నారని మంత్రి కందుల దుర్గేశ్(Minister Kandula Durgesh) అన్నారు. పుట్టిన రోజు సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy Cm Pawan Kalyan)కు జన్మదిన శుభాకాంక్షలు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

తనకు ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం కల్పించిన తమ నాయకుడు పవన్ కల్యాణ్‌కి జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. పవన్ ఒక ప్రభంజనం.. ఆయన మాట ప్రకంపనం.. జనహితం ఆయన అభిమతం అని అభివర్ణించారు. ప్రజాసేవలో పవన్ కళ్యాణ్ చూపిస్తున్న అంకితభావం చిరస్మరణీయంగా నిలబడుతుందన్నారు. పవన్ కళ్యాణ్‌ సినీ, రాజకీయ ప్రయాణం విశిష్టమైనదని, రెండింటిలోనూ స్టార్ డమ్ సంపాదించుకున్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని దుర్గేశ్ పేర్కొన్నారు. తెలుగు తల్లికి, తెలుగు కళామతల్లికి ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. రాజకీయ, సినీ రంగాల్లో పవన్ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu)తో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్నారని, ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నారని మంత్రి దుర్గేష్ తెలిపారు.

Next Story