వైకల్యం లేకుండానే పెన్షన్: మంత్రి కందుల దుర్గేశ్ ఫైర్

by Vemula.Srinu Prasad |

వైకల్యం లేకుండానే అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నారని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు....

వైకల్యం లేకుండానే పెన్షన్: మంత్రి కందుల దుర్గేశ్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: వైకల్యం లేకుండానే అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నారని మంత్రి కందుల దుర్గేశ్(Minster Kandula Durgesh) అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు(Nidadavole) క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ తొలగిస్తున్నారంటూ వైసీపీ(Ycp) చేస్తున్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. కుల, మతాలకు అతీతంగా పెన్షన్లు అందిస్తున్నానమి ఆయన తెలిపారు. పొరపాటున అర్హులకు పెన్షన్ తొలగిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొందరు ఎలాంటి వైకల్యం లేకుండానే పెన్షన్లు తీసుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వారికి చెక్ పెడతామని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) కూడా చెప్పారన్నారు. సూపర్ సిక్స్.. సూపర్ సక్సెస్ కావడంతోనే కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారని మంత్రి కందుల దుర్గేశ్ మండిపడ్డారు.

Next Story