సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా: మంత్రి కందుల దుర్గేశ్ హామీ

by Vemula.Srinu Prasad |

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం సమిశ్రగూడెం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో మంత్రి కందుల దుర్గేశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. P4 కార్యక్రమం, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అమలు, కీలక పనితీరు సూచికలపై సమగ్రంగా చర్చించారు...

సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా: మంత్రి కందుల దుర్గేశ్ హామీ
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు(Nidadhavolu) నియోజకవర్గం సమిశ్రగూడెం ఎంపీడీవో కార్యాలయం(Samishragudem MPDO Office)లో అధికారులతో మంత్రి కందుల దుర్గేశ్(Minister Kandula Durgesh) సమీక్షా సమావేశం నిర్వహించారు. P4 కార్యక్రమం, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) అమలు, కీలక పనితీరు సూచికలు (KPIs)పై సమగ్రంగా చర్చించారు. సీఎం చంద్రబాబుతో జరగనున్న జిల్లా సమీక్షకు ముందుగా నియోజకవర్గానికి సంబంధించిన కీలక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని ఆయన తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ (CVAPU) బృందం చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న కీలక సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. కంసాలిపాలెం–మాధవరం వంతెన నిర్మాణం, ఎర్రకాలువ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం, నిడదవోలు–యర్నగూడెం ప్రధాన రహదారి అభివృద్ధి, హేవలాక్ వంతెన అభివృద్ధి, చినకాశీరేవు వంతెన నిర్మాణం వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం సాధించేందుకు కృషి చేస్తానని మంత్రి కందుల దుర్గేశ్ హామీ ఇచ్చారు.

Next Story