- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nellore: చంద్రబాబుపై మంత్రి కాకాణి ఫైర్
by Vemula.Srinu Prasad |
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు....

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం కారణంగా జరిగిన పంట నష్టంపై టీడీపీ నేతలు, చంద్రబాబు చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నెల్లూరు మీడియాతో మాట్లాడిన కాకాణి రాష్ట్రంలో ఏది జరిగినా ప్రభుత్వంపై బురదచల్లడమే చంద్రబాబు పని అని మండిపడ్డారు. రైతులకు పంటపరిహారం పెంచామని పేర్కొన్నారు. అంతేకాక రైతుల ప్రీమియమ్‌ను సైతం ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. కానీ రైతులను చంద్రబాబు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ పంటల బీమాను అమలు చేస్తోంది ఏపీ ఒక్కటేనని చెప్పారు. రైతులు సంతోషంగా ఉండాలన్నదే సీఎం జగన్ ఆకాంక్షని మంత్రి కాకాణి పేర్కొన్నారు.
Next Story






