- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్‌వి వీకెండ్ పాలిటిక్స్ : Minister Jogi Ramesh
దిశ, ఏపీ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు.

X
దిశ, ఏపీ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు. పీఏసీ మీటింగ్‌లో వైసీపీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే తన లక్ష్యమంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు జోగి రమేశ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ వీకెండ్ కాల్షీట్లు అమ్ముకున్నారని ధ్వజమెత్తా. తనను నమ్మిన కొంతమంది కాపు సామాజిక వర్గం వారిని చంద్రబాబుకు అమ్మేయడానికి వీకెండ్ నాటకాలకు తెరలేపారని విమర్శించారు. వ్యవసాయం, కౌలు రైతుల గురించిన కనీస అవగాహన లేని పవన్ కల్యాణ్ సేద్యం గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో ఒంటరిగి పోటీ చేస్తామని చెప్పే దమ్ము పవన్ కల్యాణ్‌కు ఉందా అని మంత్రి జోగి రమేశ్ నిలదీశారు.
Next Story






