- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ బిల్లులపై మంత్రి జనార్థన్ రెడ్డి కీలక ప్రకటన
విద్యుత్ బిల్లుపై మంత్రి జనార్థన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు...

దిశ, వెబ్ డెస్క్: పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలు, గృహ వినియోగదారులపై నూతన సంవత్సరంలో విద్యుత్ బిల్లుల(Electricity bills) భారం తగ్గించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం(Kutami Government) పని చేస్తుంది. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటి వరకు ప్రజలపై పడుతున్న విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల భారాన్ని భరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. సాధారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ట్రూ అప్ ఛార్జీలను పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. కానీ ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీ విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తోంది. సామాన్య ప్రజలపై మరింత ఆర్ధిక భారం మోపకూడనే ఉద్దేశంతో ఏపీఈఆర్సీ ప్రతిపాదనలను సైతం తిరస్కరించింది. ఈ విషయాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి(Minister BC Janardhan Reddy) వెల్లడించారు. రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ, సోలార్, పవన విద్యుత్ లకు అధిక సబ్సిడీలను అందిస్తున్నామని పేర్కొన్నారు.






