- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఐదేళ్లు ప్యాలెస్‌లకే పరితమైన వ్యక్తి జగన్’.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(Former CM YS Jagan) మాటలు వింటుంటే ఆయన మానసిక పరిస్థితి బాగా లేదనిపిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) అన్నారు.

దిశ,వెబ్‌డెస్క్: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(Former CM YS Jagan) మాటలు వింటుంటే ఆయన మానసిక పరిస్థితి బాగా లేదనిపిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) అన్నారు. ఈ క్రమంలో సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. 150 సీట్లతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి.. ఐదేళ్లు ప్యాలెస్‌లకే పరిమితమయ్యారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండొద్దని ప్రజలు ఓడించారు. అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా.. నిరంతరం ప్రజల కోసం పనిచేసే వాడే నిజమైన నాయకుడు అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
ఈ క్రమంలో గత వైసీపీ(YSRCP) ప్రభుత్వ హయాంలో 70 శాతం మందికి జీవనాధారం అయిన శాఖలను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఒక్క సెంటు భూమికి అయినా సాయిల్ టెస్ట్ జరిగిందా? అని ప్రశ్నించారు. రాయలసీమ జిల్లా(Rayalaseema District)లో ఎక్కువ మంది డ్రిప్ ఇరిగేషన్ పై ఆధారపడి ఉంటారు. మాజీ సీఎం జగన్(Former CM Jagan) ఏమైనా చర్యలు తీసుకున్నారా? అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం(AP Government) అధికారంలోకి వచ్చాక ధాన్యం కొన్న రెండు గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయని తెలిపారు. ప్రభుత్వం దృష్టిలో మిర్చి రైతుల సమస్యలు ఉన్నాయి. ఊక దంపుడు ఉపన్యాసం వైఎస్ జగన్ ఇచ్చారు. మార్కెట్‌లో ధర తక్కువ ఉంటే మద్దతు ధర ప్రభుత్వం ప్రకటిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో రూ.7 వేలు మద్దతు ధర ఇచ్చారు. అప్పటికే మార్కెట్లో రూ.12 వేలు ఉంది. ఇప్పుడు పని లేని జగన్ మిర్చి యార్డ్(Guntur Mirchi Yard) కు వెళ్లి విమర్శలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.






