పవన్ కల్యాణ్‌కు రాజ్యసభ అభ్యర్థిని పరిచయం చేసిన మంత్రి..

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-29 15:07:34  IST  )

ఆంధ్రప్రేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)తో మంత్రి సత్యకుమార్(Satya Kumar) భేటీ అయ్యారు.

పవన్ కల్యాణ్‌కు రాజ్యసభ అభ్యర్థిని పరిచయం చేసిన మంత్రి..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)తో మంత్రి సత్యకుమార్(Satya Kumar) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాజ్యసభ(Rajya Sabha) అభ్యర్థి పాక సత్యానారాయణ(Paka Satyanarayana)ను పవన్ కల్యాణ్‌కు మంత్రి సత్యకుమార్ పరిచయం చేశారు. తన అభ్యర్థిత్వానికి మద్దతిచ్చినందుకు పవన్ కల్యాణ్‌కు సత్యానారాయణ ధన్యవాదాలు చెప్పారు. కాగా, ఏపీలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీ భర్తీపై ఉత్కంఠకు సోమవారం తెరపడింది. రాజ్యసభ అభ్యర్థిని బీజేపీ(BJP) అధిష్టానం ఖరారు చేసింది. అనూహ్యంగా రాజ్యసభ అభ్యర్థిగా పశ్చి మగోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నేత పాకా వెంకటసత్యనారాయణను బీజేపీ నాయకత్వం ప్రకటించింది. పాకా వెంకట సత్యనారాయణ ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.

Next Story