- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిన్నిస్ బుక్ మీద ఉన్న శ్రద్ధ సూపర్ సిక్స్ మీద లేదు..మాజీ మంత్రి ఫైర్
చంద్రబాబుకు గిన్నిస్ బుక్‌పై ఉన్న శ్రద్ధ సూపర్ సిక్స్‌పై లేదంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత ఉత్తరాంధ్రకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబుకు గిన్నిస్ బుక్‌పై ఉన్న శ్రద్ధ సూపర్ సిక్స్‌పై లేదంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత ఉత్తరాంధ్రకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు యోగా కార్యక్రమాన్ని పబ్లిసిటీ కోసమే వాడుకున్నారని తెలిపారు. యోగాకు కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని మండిపడ్డారు. 300 కోట్లు ఖర్చు పెట్టి గిరిజన విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భోజనం, నీళ్లు, మ్యాట్స్ ఏవీ ఇవ్వలేకపోయారని విమర్శించారు. విద్యార్థులకు అండగా వైసీపీ యువతపోరు కార్యక్రమం చేపడుతుందని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరవాత నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని అన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యువతపోరు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. నమ్మిన ప్రజలను చంద్రబాబు నట్టేట ముంచారని, విశాఖకు మోడీని పిలిచి పెద్ద డ్రామా చేశారని విమర్శించారు. తక్కువ సమయంలో ఎక్కువ అప్పులు చేసి చంద్రబాబు రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు.






