AP News : కడప విద్యుత్ షాక్ ఘటనపై మంత్రి గొట్టిపాటి దిగ్భ్రాంతి

by Muthe.Rajitha |

వైయస్సార్ కడప(YSR Kadapa) జిల్లా బీ కోడూరు మండలంలో నేడు విద్యుత్ షాక్(Electric Shock) తో తల్లీ కొడుకులు మృతి చెందిన విషయం తెలిసిందే.

AP News : కడప విద్యుత్ షాక్ ఘటనపై మంత్రి గొట్టిపాటి దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్ డెస్క్ : వైయస్సార్ కడప(YSR Kadapa) జిల్లా బీ కోడూరు మండలంలో నేడు విద్యుత్ షాక్(Electric Shock) తో తల్లీ కొడుకులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్(Minister Gottipati Ravi Kumar) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే ఇంట్లో తల్లి, కుమారుడు చనిపోవడం తనను కలిచి వేసిందని మంత్రి ఆవేదన చెందారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదే విధంగా రైతులు పొలాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు. ఎక్కడైనా వేలాడుతున్న కరెంట్ తీగలు కనబడితే అధికారులకు తక్షణమే సమాచారం అందించాలని సూచించారు. నేలకు వేలాడే తీగలను గుర్తించి తక్షణమే అధికారులు మరమ్మత్తులు చేపట్టాలని, విద్యుదాఘాతం ఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అయితే మంగళవారం పొలానికి నీరు పెడుతూ విద్యుత్తు షాక్ తో తల్లీ కొడుకు మృతి చెందిన ఘటన వైయస్సార్ జిల్లా బి. కోడూరు మండలంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. గుంతపల్లి గ్రామానికి చెందిన కూరాకు జయరాం రెడ్డి(48) గురమ్మ (60) ఉదయం గ్రామ సమీపాన ఉన్న తెలుగు గంగ కాలువలో పొలానికి నీరు అందిస్తున్న సమయంలో మోటారు ఆగిపోయింది. చిన్నపాటి మరమ్మత్తులు చేస్తున్న సమయంలో జయరాం రెడ్డికి విద్యుత్ షాక్​కు గురయ్యాడు. అతనిని కాపాడబోయిన తల్లి కూడా విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఒకే గ్రామానికి ఇరువురు చనిపోవడంతో గుంతపల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. బి కోడూరు పోలీసులు సంఘటన చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story