రైతులకు కరెంట్ బిల్లులు ఎక్కువగా రావడానికి కారణం వైసీపీనే: మంత్రి గొట్టిపాటి

by Naga Rani Yarlagadda |

గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన అందరికీ శిక్ష పడుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

రైతులకు కరెంట్ బిల్లులు ఎక్కువగా రావడానికి కారణం వైసీపీనే: మంత్రి గొట్టిపాటి
X

దిశ, వెబ్‌డెస్క్: గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన అందరికీ శిక్ష పడుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravi Kumar) అన్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసు (AP Liquor Scam Case)లో చట్టప్రకారమే అంతా జరుగుతుందన్నారు. రైతులకు విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని వైసీపీ (YCP) నేతలు చేసిన ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు (Smart Meters) బిగించడం లేదని స్పష్టం చేశారు. రైతులకు కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని చేస్తున్న ఆరోపణలను ఖండించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే 9సార్లు విద్యుత్ బిల్లులు పెంచారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తల్లికి వందనం ద్వారా రూ.10 వేల కోట్లను అందజేశామని తెలిపారు. అలాగే విద్యార్థులకు కావలసిన వస్తువులన్నింటినీ క్వాలిటీగా ఇచ్చామని, విద్యార్థులకు పంపిణీ చేసిన బ్యాగులపై రాజకీయ నాయకుల ఫొటోలు కూడా వేయలేదన్నారు.

Next Story