- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోకేష్ సవాల్ స్వీకరించే ధైర్యం వైసీపీలో ఒక్కరికైనా ఉందా: మంత్రి గొట్టిపాటి
లోకేష్ సవాల్ స్వీకరించే ధైర్యం వైసీపీలో ఒక్కరికైనా ఉందా అంటూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: లోకేష్ సవాల్ స్వీకరించే ధైర్యం వైసీపీలో ఒక్కరికైనా ఉందా అంటూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కరోజులో విద్యార్థులకు రూ.10వేల కోట్ల లబ్ది చేకూరడం ఓ రికార్డు అని చెప్పారు. స్కూల్స్ తెరిచిన రోజే పుస్తకాల పంపిణీ, నాణ్యమైన విద్యాకిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. తల్లులకు చేకూరే లబ్ధి చూసి ఓర్వలేకనే వైసీపీ విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
నిన్నటిదాకా మహిళలను వైసీపీ సైకోలు కించపరిచారని ఇప్పుడు తల్లులు ఆనందంగా ఉండటం చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్, టీచర్ల నియామకంపైనే కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. ఇదిలా ఉంటే తల్లికి వందనం పథకం కింద రూ.13 వేలు విద్యార్థుల ఖాతాల్లో రూ.2వేలు లోకేష్ ఖాతాలో పడ్డాయని వైసీపీ విమర్శలు చేస్తోంది. దీంతో వైసీపీ తన ఖాతాలోకి డబ్బులు వచ్చినట్టు రుజువు చేయాలని లేదంటే తీవ్రపరిణామాలు ఉంటాయని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.






