- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వైసీపీ నేతల మైండ్ బ్లాంక్’.. మంత్రి దుర్గేష్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రం(Andhra Pradesh)లో లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లో లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆదివారం మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ప్రవేశపెట్టిన నూతన లిక్కర్ పాలసీ విధానం బాగుందని అన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలకు నాణ్యమైన మద్యం అందిస్తున్నామని మంత్రి పునరుద్ఘాటించారు.
మద్యం డిపోల నిర్వహణ, మద్యం సరఫరా ఆర్డర్ జారీ ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వైసీపీకి గట్టి షాక్ తగిలిందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. లిక్కర్ స్కాంలో తీగ లాగితే డొంకంతా కదులుతుందని మంత్రి వెల్లడించారు. వైసీపీ నేతల నిజ స్వరూపం ఇప్పుడు బయట పడుతోందన్నారు. లిక్కర్ స్కాం లో రోజుకో కీలక పరిణామం బయట పడుతుండడంతో తప్పు చేసిన వైసీపీ నేతల(YCP Leaders) మైండ్ బ్లాంక్ అవుతోందని మంత్రి దుర్గేష్ తెలిపారు.






