‘ఆ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా’.. మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ప్రతిష్టాత్మక అఖండ గోదావరి ప్రాజెక్టు అంతర్భాగంగా ప్రఖ్యాత కోటసత్తెమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

‘ఆ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా’.. మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక అఖండ గోదావరి ప్రాజెక్టు అంతర్భాగంగా ప్రఖ్యాత కోటసత్తెమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఆషాడ మాసం చివరి ఆదివారం సందర్భంగా నిడదవోలు రూరల్ మండలంలోని తిమ్మరాజుపాలెం లో ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన కోట సత్తెమ్మ ఆలయంలో శాకాంబరిగా దర్శనమిచ్చిన అమ్మవారిని మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితులు మంత్రి దుర్గేష్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆషాడ మాస ఉత్సవాల సందర్భంగా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి మంత్రి దుర్గేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి దుర్గేష్ కు ఆలయ అధికారులు, పూజారులు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ఆషాడ మాసంలో శాకాంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కొలిచిన వారికి కొంగు బంగారమై నిలిచే కోట సత్తెమ్మ అమ్మవారు నేడు శాకాంబరీ దేవి అలంకరణలో భక్తులందరికీ ఆశీర్వాదం అందిస్తుండటం శుభ సందర్భంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను సుభిక్షంగా ఉంచాలని, వేలాదిగా తరలి వచ్చే భక్తులకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ క్రమంలో భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలో అఖండ గోదావరి ప్రాజెక్టులో అంతర్భాగంగా కోటసత్తెమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా అధ్యాత్మికతను మెరుగుపరిచేందుకు ఆలయ ఆవరణం అభివృద్ధి, ఆలయ గోపురం ఆధునికీకరణ చేయడంతో పాటు భక్తుల సౌకర్యార్థం అదనపు యాత్రికుల వసతి గృహాలు తదితర అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. పర్యాటక శాఖ మంత్రిగా తాను కోట సత్తెమ్మ ఆలయ దీర్ఘకాలిక అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

Next Story