‘ఉపాధి అవకాశాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం’.. మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో విద్యారంగ అభివృద్ధి జరుగుతోందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

‘ఉపాధి అవకాశాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం’.. మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో విద్యారంగ అభివృద్ధి జరుగుతోందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఇవాళ(సోమవారం) వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్ లో తన ఛాంబర్‌లో మంత్రి కందుల దుర్గేష్ తన చేతుల మీదుగా ఎంతో మందిని టీచర్లుగా తీర్చిదిద్దిన "ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్" వారి డీఎస్సీ ట్రై మెథడ్స్ మెటీరియల్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అకాడమీ పాఠ్య పుస్తకాల ఆధారంగా, ప్రస్తుత సిలబస్ ప్రకారం గణితం, విజ్ఞాన, సాంఘిక శాస్త్రం ట్రై మెథడ్స్ మెటీరియల్‌ను రూపొందించిన విషయ నిపుణులు బాలరాజును మంత్రి దుర్గేష్ అభినందించారు. దీంతో పాటు 1500 కు పైగా బిట్స్ కలిగిన బుక్ లెట్ సైతం ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు.

డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో స్వీయ లోపాలు సవరించుకునే ప్రాక్టీస్ బిట్స్‌తో పాటు గత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నాపత్రాలతో ఉన్న మెటీరియల్ అభ్యర్థులకు ఉపకరిస్తుందని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం 16 వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో ఎస్జీటీ అభ్యర్థులకు మేలు చేసేలా మెటీరియల్ రూపొందించారని ప్రశంసించారు.

రాష్ట్ర విద్యార్థులకు రాయితీ పై మెటీరియల్ అందించాలని, అదే విధంగా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న శిక్షణ తరగతుల్లో డీఎస్సీ అభ్యర్థులకు అవసరమైన మెలకువలు అందించాలని తెలిపారు. సమాజాభివృద్ధిలో విద్యారంగానిది కీలకపాత్ర అని మంత్రి దుర్గేష్ అన్నారు. కూటమి సర్కార్ తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో విద్యారంగానికి పునర్వైభవం వచ్చిందన్నారు. ఏపీలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Next Story