AP News:టూరిజం అభివృద్ధికి పెద్దపీట.. మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుందని పర్యాటక శాఖ(Department of Tourism) మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) పేర్కొన్నారు.

AP News:టూరిజం అభివృద్ధికి పెద్దపీట.. మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుందని పర్యాటక శాఖ(Department of Tourism) మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) పేర్కొన్నారు. ఈ క్రమంలో పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, రానున్న ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ద్వారకా ఢిల్లీ(Delhi)లోని యశో భూమిలో బుధవారం జరిగిన సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్(South Asia's Leading Travel), టూరిజం ఎగ్జిబిషన్ -2025 (SATTE)లో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించిందన్నారు. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ పర్యాటక రంగానికి కూడా వర్తిస్తాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి(Tourism Development) కోసం నూతన టూరిజం పాలసీ 2024-29ని తీసుకువచ్చామని తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ (PPP) విధానం ద్వారా పర్యాటకాభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున మెరుగైన రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించి ప్రభుత్వం(Government) తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా టూరిజం సర్క్యూట్‌లు, యాంకర్‌ హబ్‌లు, థీమాటిక్‌ అప్రోచ్‌ ఏర్పాటు, అంతర్జాతీయ మౌలిక వసతుల కల్పన వంటి విభిన్న కార్యక్రమాలు, పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.

Next Story