కృష్ణవేణి సంగీత నీరాజనం వేడుకలు అద్భుతం.. మంత్రి దుర్గేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

కృష్ణవేణి సంగీత నీరాజనం వేడుకలు అద్భుతమని మంత్రి దుర్గేష్ అన్నారు...

కృష్ణవేణి సంగీత నీరాజనం వేడుకలు అద్భుతం.. మంత్రి దుర్గేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణవేణి సంగీత నీరాజనం వేడుకలు(Krishnaveni Sangeetha Neerajanaam celebrations) అద్భుతమని ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విజయవాడ(Vijayawada) తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళా క్షేత్రంలో కృష్ణవేణి సంగీత నీరాజనం వేడుకలను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. కృష్ణా నది తీరాన జరుగుతున్న కృష్ణవేణి సంగీత నీరాజనం వేడుకలు విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. కృష్ణవేణి తరంగాల మధ్య జరుగుతున్న కృష్ణవేణి సంగీత నీరాజనం సంగీత ధ్వని అని, సంగీత ఝరి అని దుర్గేష్ అభివర్ణించారు. అజరామరమైన సంగీత ప్రవాహానికి, కళా సంస్కృతిక వైభవానికి ఏపీ చిరునామా అని కొనియాడారు. సంగీతం, నాట్యం, నటన తదితర కళారూపాల్లో నిష్ణాతులైన కళాకారులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారన్నారు. కుల, మతాలు లేని సంగీతానికి, కళారూపాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. తెలుగు జానపద కళారూపాలైన తోలుబొమ్మలాట, హరికథ, బుర్రకథ తదితర కళారూపాలను ప్రభుత్వం పరంగా నేటి తరానికి అందిస్తామని చెప్పారు. ఏ రంగాల్లో ఉన్నప్పటికీ మన ఆచారాలు, సంప్రదాయాలు, కళా రీతుల్ని పిల్లలకు నేర్పించటాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం కేవలం విజయవాడలోనే కాకుండా గోదావరి తీరం రాజమండ్రి, శ్రీశైలం, మంగళగిరి, శ్రీకాళహస్తి మొవ్వ తదితర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కందుల దుర్గేష్ తెలిపారు.

Next Story