గిరిజన రైతులకు గుడ్ న్యూస్.. మంత్రి కందుల కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

అరకు కాఫీ తోటలను పర్యాటకంతో అనుసంధానం చేసి గిరిజన రైతులకు మరింత లాభం చేకూర్చేలా 'కాఫీ ఎక్స్‌ పీరియన్స్ సెంటర్స్' ఏర్పాటు చేస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు.....

గిరిజన రైతులకు గుడ్ న్యూస్.. మంత్రి కందుల కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: అరకు కాఫీ తోటల(Araku Coffee Plantations)ను పర్యాటకంతో అనుసంధానం చేసి గిరిజన రైతుల(Tribal Farmers)కు మరింత లాభం చేకూర్చేలా 'కాఫీ ఎక్స్‌ పీరియన్స్ సెంటర్స్'(Coffee Experience Centers) ఏర్పాటు చేస్తామని మంత్రి దుర్గేష్(Minister Durgesh) తెలిపారు. గుమ్మిడి సంధ్యారాణి(Gummidi SandyaRani)తో కలిసి అరకు ఉత్సవ్ -2026(Araku Utsav-2026)లో ఆయన పాల్గొన్నారు. "ప్రతి కుటుంబానికి ఒక పర్యాటక ఉపాధి" లక్ష్యంతో రాబోయే పదేళ్లలో ప్రతి ఇంట్లో కనీసం ఒకరికి పర్యాటక రంగంలో ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు. అరకు ఉత్సవం మన సంస్కృతిని కాపాడుతూ, మన ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తుందని నమ్ముతున్నామని తెలిపారు. అరకు, పాడేరు, లంబసింగిలో 60 హోమ్ స్టేల గుర్తింపుతో పాటు స్థానిక జీవనోపాధి బలోపేతంకు చర్యలు తీసుకుంటామన్నారు. అరకు హరిత యాత్రి నివాస్‌లో 40 నుంచి 60కి, మయూరి రిసార్ట్‌లో 65 నుంచి 98కి, తైడ జంగిల్ బెల్స్‌‌లో 13 నుంచి 26‌కు గదుల సంఖ్యను పెంచామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.

అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఏపీ తూర్పు తీరం

ఏపీ తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ సంకల్పమని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. "జల్-జంగిల్-జమీన్"(Jal-Jungle-Zameen) స్ఫూర్తితో అరకును పర్యావరణహిత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని చెప్పారు. స్వదేశీ దర్శన్ 2.0(Swadeshi Darshan 2.0) ద్వారా రూ.29.88 కోట్లతో బొర్రా గుహలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అత్యాధునిక లైటింగ్, ఫ్లోరింగ్, ప్రొజెక్ట్ మ్యాపింగ్, సేఫ్టీ రేయిలింగ్స్, పార్కింగ్, విజిటర్స్ ఎమినిటీస్, రెస్టారెంట్స్, సావనీర్ షాప్స్, ఈవీ బగ్గీలు, పర్యాటక సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయిలో అరకును అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ. 42.30 కోట్లతో హరిత రిసార్ట్స్‌ను ఆధునీకరిస్తామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.

Next Story