- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీకి ప్రతిష్టాత్మక అవార్డు... అందుకున్న మంత్రి దుర్గేష్
గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 ప్రకటించిన ‘ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం’ అవార్డును మంత్రి కందుల దుర్గేష్ అందుకున్నారు..

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ (GTM) 2026 ప్రకటించిన ‘ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం’(Best tourism promoting state) అవార్డును మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) అందుకున్నారు. కేరళం రాజధాని తిరువనంతపురం(Thiruvananthapuram)లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రం తరఫున ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు అందుకోవడం గర్వకారణమని చెప్పారు. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు, రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రంలో సహజ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేయడానికి జరుగుతున్న కృషికి నిదర్శనమన్నారు. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి, ఏపీని ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు చూపుతున్న నిబద్ధత ప్రశంసనీయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ దేశ, విదేశీ పర్యాటకులను మరింతగా ఆకర్షించాలని కందుల దుర్గేష్ ఆకాంక్షించారు.






