‘దక్షిణ భారత టూరిజానికి ఏపీ ముఖద్వారం’.. మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-05 09:10:05  IST  )

ఏపీ(Andhra Pradesh) పర్యాటక శాఖ(Tourism Minister) మంత్రి కందుల దుర్గేష్(Kandula Durgesh) జర్మనీ(Germany)లోని బెర్లిన్‌ ఎక్స్‌పో సెంటర్‌ సిటీలో ప్రారంభమయ్యే ఐటీబీ బెర్లిన్‌-2025 సదస్సులో పాల్గొనేందుకు జర్మనీ బయలుదేరి వెళ్లారు

‘దక్షిణ భారత టూరిజానికి ఏపీ ముఖద్వారం’.. మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) పర్యాటక శాఖ(Tourism Minister) మంత్రి కందుల దుర్గేష్(Kandula Durgesh) జర్మనీ(Germany)లోని బెర్లిన్‌ ఎక్స్‌పో సెంటర్‌ సిటీలో ప్రారంభమయ్యే ఐటీబీ బెర్లిన్‌-2025 సదస్సులో పాల్గొనేందుకు జర్మనీ బయలుదేరి వెళ్లారు. అక్కడి ఎయిర్‌పోర్టులో ఆయనకు కూటమి శ్రేణులు స్వాగతం పలికారు. జర్మనీ పర్యటనలో ఉన్న పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ రెండో రోజు బెర్లిన్ సదస్సులో పాల్గొన్నారు.

పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు(International Investments) సాధించేందుకు ఏపీ పర్యాటక(AP Tourism) రంగంలో అవకాశాలు, వనరుల గురించి వివరించారు. అంతర్జాతీయ పర్యాటక పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారేందుకు ఈ సదస్సు ఉపకరిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. దక్షిణ భారత పర్యాటకానికి ఏపీ ముఖద్వారం అని మంత్రి దుర్గేష్ వ్యాఖ్యానించారు. సుదీర్ఘ సముద్రతీరం, అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీయత ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ సొంతం అని పేర్కొన్నారు. మంత్రి దుర్గేష్‌తో పాటు APTDC ఎండీ ఆమ్రపాలి కాట బెర్లిన్‌కు వెళ్లారు.

Next Story