- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రోజే అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన.. మంత్రి దుర్గేష్ వెల్లడి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కేంద్రం ద్వారా దాదాపు రూ.375 కోట్ల పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేసిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కేంద్రం ద్వారా దాదాపు రూ.375 కోట్ల పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేసిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ తరుణంలో రూ.94.44 కోట్లతో చేపట్టే అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ నెల(జూన్) 26న ఉదయం 10 గంటలకు శంకుస్థాపన చేస్తారని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఇప్పటికే పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది.. తొలుత పుష్కర్ ఘాట్ సుందరీకరణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
దీనిలో భాగంగా హేవలాక్ వంతెన, పుష్కర ఘాట్, కడియం నర్సరీ, కోట సత్తెమ్మ గుడి, నది తీరాలు అభివృద్ధి చేస్తామన్నారు. బోటింగ్, టెంట్ సిటీ, నిత్య హారతి అందుబాటులోకి తేస్తామన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు విచ్చేస్తున్న కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుతో ఏటా దాదాపు 15 -20 లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా 8 వేల మందికి పైగా ఉపాధి అవకాశం, ఆర్థిక అభివృద్ధికి కల్పించనున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు.






