వైవీ సుబ్బారెడ్డి పీఏ ఖాతాలోకి కోట్లు..?: మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-21 08:18:53  IST  )

వైవీ సుబ్బారెడ్డి పీఏ ఖాతాలోకి కోట్లు ఎలా వెళ్లాయని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ప్రశ్నించారు...

వైవీ సుబ్బారెడ్డి పీఏ ఖాతాలోకి కోట్లు..?: మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు(Adulterated ghee case)లో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(Former TTD Chairman YV Subbare)ని సిట్ అధికారులు హైదరాబాద్(Hyderabad)లో విచారించిన విషయం తెలిసిందే. ఆయన పీఏ అప్నన్నను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే ఇప్పుడు ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. అన్యాయంగా, అక్రమంగా వైవీ సుబ్బారెడ్డిని కల్తీ నెయ్యి కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcp Congress) నాయకులు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఇందుకు టీడీపీ(Tdp) మంత్రులు, నాయకులు సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. అంతేకాదు సంచలన ఆరోపణలు సైతం చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి పీఏ బ్యాంకు ఖాతాల్లోకి కోట్లు వెళ్లడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి చుట్టే అవినీతి లింకులు తిరుగుతున్నాయని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. కల్తీ నెయ్యి కేసుపై విచారణ కొనసాగుతోందని, నిందితులెవరైనా సరే విడిచిపెట్టేది లేదని మంత్రి వీరాంజనేయ స్వామి తెలిపారు.

Next Story