- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం కేసులో మరో సంచలనం.. వారికి శిక్ష తప్పదని మంత్రి వార్నింగ్
మద్యం కేసులో వారికి శిక్ష తప్పదంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జోస్యం చెప్పారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు(AP Liquor Scam Case) రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో వైసీపీ(Ycp)కి చెందిన కీలక నేతలు సైతం అరెస్ట్ అయి జైలు(Jail)కు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులపై వైసీపీ శ్రేణులు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. తమ నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతూ అక్రమంగా కేసులు బనాయించి, అన్యాయం జైలుకు పంపుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు.
అయితే ఇందుకు టీడీపీ నేతలు సైతం స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన మద్యం అవినీతిపై కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం వేదికగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పేరు చెప్పి మద్యం అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడ్డారని మండిపడ్డారు. మద్యం స్కాంలో దాదాపు రూ. 4 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ కేసులో నిందితులకు శిక్ష తప్పదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి( Minister BC Janardhan Reddy) హెచ్చరించారు. జగన్ హయాంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమం కేసులు పెట్టారని, వాటన్నింటిపై విచారణ జరిపి న్యాయం చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు.






