- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Agriculture Budget: రైతులకు శుభవార్త.. మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన
రైతులకు మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన చేశారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. రూ.48, 340 కోట్లు కేటాయింపును ప్రతిపాదిస్తున్న ఆయన తెలిపారు. వ్యవసాయ రంగంలో 15 శాతం వృద్ధి తమ లక్ష్యమని అచ్చెన్న పేర్కొన్నారు. గ్రోత్ ఇంజిన్లుగా 11 పంటలను తీసుకుంటున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7. 78 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశామన్నారు. రూ. 120 కోట్ల విత్తన రాయితీ బకాయిలను చెల్లించామని పేర్కొన్నారు. ఎరువుల నిర్వహణకు రూ. 40 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి రూ. 61 కోట్లు, యంత్రాల రాయితీకి రూ. 139. 65 కోట్లు, డ్రోన్ల రాయితీలకు రూ.80 కోట్లు, కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాల ఏర్పాటుకు రూ.875 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాల కోసం రూ.250 కోట్లు, కొత్త కౌలు చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్న ప్రకటించారు.
అలాగే ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ రూ. 400 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం రూ. 6.300 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ. 300 కోట్లు, సాగు నీటి ప్రాజెక్టులు రూ. 11, 314 కోట్లు, పోలవరం నిర్మాణం రూ. 6,705 కోట్లు, భూమి లేని కౌలు రైతులకు కూడా ఏడాదికి రూ. 20 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యాన శాఖకు రూ.930.88 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.12,401 కోట్లు, పంటల బీమా పథకానికి రూ. 1.028 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు.






