‘మెరీనా బ్యారేజ్’ సందర్శన గొప్ప అనుభవం: మంత్రి అచ్చెన్నాయుడు

by Vemula.Srinu Prasad |

సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు 'మెరీనా బ్యారేజ్'ను సందర్శించడం ఒక గొప్ప అనుభవమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు...

‘మెరీనా బ్యారేజ్’ సందర్శన గొప్ప అనుభవం: మంత్రి అచ్చెన్నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్: సింగపూర్ పర్యటన(Singapoor Tour)లో భాగంగా ఈరోజు 'మెరీనా బ్యారేజ్'(Merina Barriage)ను సందర్శించడం ఒక గొప్ప అనుభవమని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) అన్నారు. కేవలం ఒక డ్యామ్ లాగే కాకుండా.. అటు తాగునీటి అవసరాలను తీరుస్తూ, ఇటు వరదలను నియంత్రిస్తూ, మరోవైపు ప్రపంచ స్థాయి వినోద కేంద్రంగా ఈ బ్యారేజ్ నిలుస్తున్న తీరు అద్భుతమని ఆయన కొనియాడారు. NUS Cities డైరెక్టర్ ఖూ టెంగ్ చైతో కలిసి ఇక్కడి పర్యావరణ అనుకూల విధానాలను అధ్యయనం చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మన అమరావతి అభివృద్ధిలో, ముఖ్యంగా కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఇలాంటి అంతర్జాతీయ మోడల్స్‌ను తీసుకువచ్చే దిశగా తమ బృందం కృషి చేస్తోందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నవ్యాంధ్రను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.

4వ రోజుకు సింగపూర్ టూర్

కాగా మంత్రుల బృందం సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు వీరి శిక్షణా కార్యక్రమం 4వ రోజుకు చేరుకుంది. సింగపూర్ అవలంబిస్తున్న విధానాలు రాష్ట్రంలో అమలులో సాధ్యసాద్యాలపై మంత్రులు అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మెరీనా బ్యారేజ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.

Next Story