టీడీపీకి లోకేశే వారసుడు: మంత్రి అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తర్వాత నారా లోకేశే వారసుడని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు..

టీడీపీకి లోకేశే వారసుడు: మంత్రి అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)కి చంద్రబాబు(Chandrababu) తర్వాత నారా లోకేశే(Nara Lokesh) వారసుడని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం లోకేశ్ అంటూ జరుగుతున్న ప్రచాయంపై ఆయన స్పందించారు. టీడీపీ(Tdp)కి లోకేశ్ వారసుడని ఏ చిన్న పిల్లవాడిని అడిగా చెబుతున్నారన్నారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. యువగళం పాదయాత్ర(Yuva Galam Padayatra) చేపట్టి పార్టీ కార్యకర్తల్లో లోకేశ్ ధైర్యం నింపారని తెలిపారు. ఎవరు కాదన్నా వద్దన్నా తెలుగుదేశం పార్టీకి లోకేశే నాయకుడు అని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకున్న కూటమి పార్టీలు కలిసి తీసుకుంటాయని అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Next Story