- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు గుడ్ న్యూస్.. ఎరువుల పంపిణీపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన
ఎరువుల పంపిణీపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన చేశారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎరువుల(Fertilizers)కు బాగా డిమాండ్ ఉంది. దీంతో కొందరు వ్యాపారులు బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు రైనీ సీజన్ కొనసాగుతోంది. దీంతో ఎరువులు అనుకున్న మేర అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీన్ని అదునుగా భావించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన ఎరువులను తీసుకురాలేకపోతున్నారని సెటైర్లు వేస్తున్నారు.
దీంతో ఎరువుల నిల్వలు, సరఫరాపై మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) కేంద్ర, రాష్ట్ర అధికారులతో చర్చించారు. ఈ మేరకు రైతులకు గుడ్ న్యూస్ తెలిపారు. రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఉండదని భరోసా ఇచ్చారు.. 31.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అంచనా వేశామని, ఇప్పటివరకు 21.34లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని తెలిపారు. 6.22లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 1.10 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. కేంద్రం నుంచి ఇంకా ఎరువులు రావాల్సి ఉందన్నారు. ఎరువులను అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.






