- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ సభపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ పేరిట ఈనెల 16న ఏపీలోని కర్నూలులో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది.

దిశ, వెబ్‌డెస్క్ : ‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ పేరిట ఈనెల 16న ఏపీలోని కర్నూలులో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అత్యంత శ్రద్ధగా, సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. ప్రతి శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు, కార్యకర్తలు ఒకే బృందంలా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ నియంత్రణ నుంచి సభా ప్రాంగణం వరకు అన్ని అంశాలను సమగ్రంగా పర్యవేక్షించాలన్నారు.
‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ సభ దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ప్రజల ముందుంచే వేదిక అన్నారు. ప్రధాని ప్రజలతో నేరుగా మమేకమవుతారని, అందువల్ల ఈ సభను చారిత్రాత్మకంగా మార్చాలన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే సభగా నిలవాలని అన్నారు. అనంతరం సభా ప్రాంగణం, వేదిక, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, నీటి సదుపాయం, మీడియా సౌకర్యాలు, వాలంటీర్ వ్యవస్థ వంటి అంశాలపై మంత్రి విస్తృతంగా సమీక్షించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలిచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, గుమ్మడి సంధ్యారాణి, అలాగే కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.






