AP News:ఎట్టకేలకు ఫ‌లించిన మంత్రి అచ్చెన్నాయుడు కృషి

by Jakkula.Mamatha |

తోతాపూరి మామిడి క్వింటాకు రూ.1,490 ను కేంద్రం ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

AP News:ఎట్టకేలకు ఫ‌లించిన మంత్రి అచ్చెన్నాయుడు కృషి
X

దిశ,వెబ్‌డెస్క్: తోతాపూరి మామిడి క్వింటాకు రూ.1,490 ను కేంద్రం ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. మామిడి రైతులకు న‌ష్టం రాకూడ‌ద‌ని ముందుగానే గ్ర‌హించి కిలో మామిడిని రూ.12ల‌కు కొనుగోలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా కేజీ మామిడికి రూ.4 స‌బ్సిడీ ని అంద‌జేశామ‌ని అన్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన ధరను మామిడి రైతులకు ఏపీ ప్రభుత్వం అందజేసిందని తెలిపారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ లకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది అత్య‌ధిక దిగుబ‌డి రావ‌డంతో మామిడి ధ‌ర త‌గ్గుముఖం ప‌ట్టింది. ఈ విష‌యాన్ని ముందే గ్రహించిన మంత్రి అచ్చెన్నాయుడు చిత్తూరు జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించి రైతులతో, ప‌ల్ప్ ఫ్యాక్ట‌రీ ప్ర‌తినిధుల‌తో సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాల‌ను సేక‌రించారు. మామిడి రైతుల స‌మ‌స్య‌ను సీఎం చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. వెంట‌నే స్పందించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌ల్ప్ ఫ్యాక్టరీలు కేజీ మామిడిని 8 రూ కొనాల‌ని, 4 రూ స‌బ్సిడీ రాష్ట్ర ప్ర‌భుత్వం అంద‌చేస్తుంద‌ని తెలిపారు.

ఇటీవల ఢీల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మం త్రి శివ‌రాజ్ సింగ్ చౌహ‌న్ ను క‌ల‌సి తోతాపూరి మామిడి రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల గురించి వివ‌రించి స‌బ్సీడి న‌గ‌దులో 50:50 నిష్ప‌త్తిలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు న‌గ‌దును చెల్లించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు అభ్య‌ర్ధ‌న‌ని ప‌రిశీలించిన కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ(మంగ‌ళ‌వారం) తోతాపూరి మామిడి క్వింటాకు రూ.1,490 ను కేంద్రం ప్ర‌క‌టించింది.

Next Story