- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా కులంపై మాట్లాడటం తగదు : మండలి చైర్మన్ vs అచ్చెన్నాయుడు
ఏపీ శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు ఛైర్మన్ పై చేసిన వ్యాఖ్యలు చిచ్చురేపాయి.

దిశ, వెబ్‌డెస్క్: మండలిలో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై జరుగుతున్న చర్చలో జగన్ క్రిస్టియన్ అని, అందుకే ఇవేవీ ఆయనకు పట్టడంలేదని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ క్రమంలో మండలి చైర్మన్ మోషేనురాజును కూడా.. మీరూ క్రిస్టియనే అనడంతో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తన కులం గురించి మాట్లాడటం తగదని సీరియస్ అయ్యారు. తాను క్రిస్టియన్ ను కాదని, హిందువునేనని క్లారిటీ ఇచ్చారు. తన గురించి ఒక మంత్రి ఇలా అనడం తన వ్యక్తిత్వాన్ని కించపరచడమేనన్నారు. తనను క్రిస్టియన్ అనుకుని సంభాషించడాన్ని వ్యతిరేకించారు. దీంతో మండలిలో అందరి ముందు తాను హిందువునే అని ఒప్పుకున్న చైర్మన్ మోషేనురాజు ఒప్పుకున్నారని, ఆయన హిందువేనన్న విషయం తనకు తెలియదన్నారు. ఈ విషయంపై తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుపగా.. అందుకు చైర్మన్ అంగీకరించారు.
క్షమాపణలు చెప్పాల్సిందే..
కానీ.. మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంపై తాను సంతృప్తిగానే ఉన్నట్లు చైర్మన్ చెప్తున్నా.. నినాదాలను కొనసాగించడంతో మండలిని ఐదు నిమిషాలపాటు వాయిదా వేశారు. తిరిగి మండలి ప్రారంభమైనా.. వైసీపీ సభ్యులు అవే నినాదాలను కొనసాగించారు.
ఎవరి మత విశ్వాసాలు వారివి
అంతకుముందు మతవిశ్వాసాలపై మాట్లాడిన అచ్చెన్న.. వెంకటేశ్వరస్వామిపై జగన్ కు ఏ మాత్రం నమ్మకం లేదన్నారు. ఆ దేవదేవుడిపై ఎందుకు ఇంత కక్షగట్టారో వైసీపీ వాళ్లే చెప్పాలన్నారు. ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయని, ఈ విషయంలో తామెలాంటి అభ్యంతరం చెప్పబోమన్నారు. కానీ.. ప్రభుత్వం తమ చేతిలో ఉందని కల్తీ నెయ్యి వాడి దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేయడమేంటని ధ్వజమెత్తారు. తాను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పుంటే చెప్పాలని సభకు ఛైర్మన్ కు తెలిపారు.






