- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు : మంత్రి అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో రైతులకు అందాల్సిన ఎరువులను ఇతర ప్రాంతాలకు తరలించడంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రైతులకు అందాల్సిన ఎరువులను ఇతర ప్రాంతాలకు తరలించడంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయేతర పనులకు ఎరువులను వాడటంపై ఆయన సీరియస్ అయ్యారు. డీలర్లు, గోదాములపై ప్రత్యేక తనిఖీలు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ను ఆదేశించారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కృత్రిమ ఎరువుల కొరత సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యంపై కూడా విచారణ చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇకపై ప్రతిరోజూ జిల్లాల వారీగా ఎరువుల స్టాక్ లపై మానిటరింగ్ చేస్తామని, రైతుల్ని మోసం చేసే చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఏ డీలరైనా ఎరువుల్ని పక్కదారి పట్టిస్తున్నట్లు రుజువైతే వారి లైసెన్సుల్ని రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.






