సీఎం దృష్టి పెట్టారు.. పనులన్నీ అయిపోతాయి: మంత్రి అచ్చెన్న కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు..

సీఎం దృష్టి పెట్టారు.. పనులన్నీ అయిపోతాయి: మంత్రి అచ్చెన్న కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆక్వా రంగాన్ని(Aqua Sector) ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) అన్నారు. సీఎం చంద్ర‌బాబు(Cm Chandrababu) ఆక్వా రంగాన్ని జోన్, నాన్ జోన్‌గా విభజించి అభివృద్ధిపై దృష్టి పెట్టారని ఆయన తెలిపారు. ఆక్వా రైతులు త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట్ర‌ర్ అవ్వాలని, రిజిష్ట్ర‌ర్ అయిన రైతుల‌కు మాత్ర‌మే స‌బ్సిడీ విద్యుత్ యూనిట్‌కు రూ. 1.50 వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు. ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి పెట్టి ఆక్వా పంట‌ల‌కు జియో ట్యాగ్ చేసి చెరువుల‌ను గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. ముమ్మ‌డివ‌రం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ఎమ్మెల్యేలు అడిగిన‌టువంటి ప్రశ్నలకు స‌మాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని ఆక్వా రైతుల‌కు స‌బ్సిడీలో 64,500 విద్యుత్ క‌లెక్ష‌న్స్ ఇవ్వొచ్చని... ఇప్ప‌టికి 50,000 విద్యుత్ క‌లెక్ష‌న్స్ ఇచ్చామ‌ని తెలిపారు.

ఎమ్మెల్యేలు బాధ్య‌త‌గా తీసుకొని ఆక్వా బిల్, రిజిష్ట్రేష‌న్ల గురించి రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలన్నారు. స‌బ్సిడీ విద్యుత్ అంద‌చేయ‌డం వ‌ల్ల రాష్ట్ర ప్ర‌భుత్వానికి రూ. 1100 కోట్లు ఖ‌ర్చు అవుతుందని, ఖ‌ర్చు ముఖ్యం కాదని.. ఆక్వారంగాన్ని గాడిలో పెట్టడమే కావాలన్నారు. రైతుల‌కు లాభ‌దాయ‌కంగా ఉండేలా రైతుల‌తో, ఆక్వా రంగ పెద్ద‌ల‌తో మాట్లాడి ఆక్వా చ‌ట్టాన్ని రూపొందించామన్నారు. 20 శాతం మంది ఆక్వా రైతులు ఇప్ప‌టివ‌ర‌కు రిజిష్ట్రేష‌న్ చేయించుకోలేదని, వారి కోసం 50 శాతం లేట్ ఫీజ్‌తో మ‌రో అవ‌కాశం క‌ల్పిస్తామని చెప్పారు. ఆక్వా క‌ల్చ‌ర్ బిజినెస్ ఆప‌రేష‌న్ లైసైన్స్ జీవిత‌కాలం ఒక సంత్స‌ర కాలం నుండి 5 ఏళ్లు త‌గ్గించేందుకు నిర్ణ‌యం తీసుకున్నామని పేర్కొన్నారు. ఆక్వా రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు, సబ్సిడీలు, మార్కెట్ అవకాశాల కల్పన, అంతర్జాతీయ మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామ‌ని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Next Story