ఆస్పత్రిలో మంత్రి ఆకస్మిక తనిఖీ.. 44 మంది సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం

by Vemula.Srinu Prasad |

టెక్కలి జిల్లా ఆసుపత్రిని మంత్రి అచ్చెన్నాయడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, రిజిస్టర్లు, వైద్య సేవలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు....

ఆస్పత్రిలో మంత్రి ఆకస్మిక తనిఖీ.. 44 మంది సిబ్బంది తీరుపై  తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: టెక్కలి జిల్లా ఆసుపత్రి(Tekkkali District Hospital)ని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, రిజిస్టర్లు, వైద్య సేవలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే విధులకు గైర్హాజరైన 44 మంది సిబ్బంది తీరుపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో నీటి సమస్యపై తక్షణమే విచారణ జరిపి, 24 గంటల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని, సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, కానీ రాజకీయ లబ్ధి కోసం ఆసుపత్రిలో రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ఇటువంటి చర్యలకు సహకరించే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

సహించే ప్రసక్తే లేదు

వైద్యులు "వైద్యో నారాయణో హరి" అన్న నానుడికి తగ్గట్టుగా పేదలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. చిన్న చిన్న సమస్యలకు కూడా రోగులను ఇతర ప్రాంతాలకు రిఫర్ చేయకూడదని అధికారులను హెచ్చరించారు. అదేవిధంగా, ప్రత్యేక చొరవతో CSR నిధులు రూ. 20 లక్షల వ్యయంతో సమకూర్చిన ఆపరేషన్ టేబుళ్లు, మల్టీపారా మానిటర్లు, వీన్ ఫైండర్స్ , పేషెంట్ చైర్లను ఆసుపత్రికి అందజేశారు. వాటిని తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, పేద ప్రజలకు భరోసా కల్పించేలా వైద్య సేవలు అందాలని, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించే ప్రసక్తే లేదని మంత్రి అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు. .

Next Story