- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాటల్లో కాదు... చేతల్లో చూపుతున్నాం: మంత్రి అచ్చెన్న కీలక వ్యాఖ్యలు
పెట్రోల్, డీజిల్ పొదుపు చర్యలపై ప్రధాని మోడీ పిలుపునకు ముఖ్యమంత్రి చంద్రబాబు అద్దం పడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు....

దిశ, వెబ్ డెస్క్: పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) పొదుపు చర్యలపై ప్రధాని మోడీ(Pm Modi) పిలుపునకు ముఖ్యమంత్రి చంద్రబాబు(Chief Minsiter Chandrababu) అద్దం పడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మాటల్లో చెప్పడం కాదని... చేతల్లో చూపిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ అనే సంకల్పానికి ఆంధ్రప్రదేశ్ అగ్రభాగంలో నిలుస్తోందన్నారు. దేశం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుంటే, ఆ ప్రచారానికి స్వయంగా ముఖ్యమంత్రినే దిక్సూచిగా మారి, ఆదర్శంగా నిలుస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. పరిపాలనలో ఎప్పుడూ సరికొత్త ప్రమాణాలు సృష్టించే ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇంధన పొదుపును కేవలం ప్రభుత్వ సూచనలకే పరిమితం చేయకుండా తన సొంత దైనందిన జీవితంలో అధికారిక పర్యటనల్లో తక్షణమే అమలు చేసి చూపించారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.






