మత్స్యకారులను మోసం చేసింది ఆ ప్రభుత్వమే: మంత్రి అచ్చెన్న సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |

మత్స్యకారుల కడుపు నింపింది కూటమి సర్కార్ అని... మోసం చేసింది జగన్ ప్రభుత్వమని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు...

మత్స్యకారులను మోసం చేసింది ఆ ప్రభుత్వమే: మంత్రి అచ్చెన్న సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: మత్స్యకారుల కడుపు నింపింది కూటమి సర్కార్ అని... మోసం చేసింది జగన్ ప్రభుత్వమని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) ఆరోపించారు. పోర్టులు, మత్స్యకారుల అభివృద్ధిపై వైసీపీ నేతలు(Ycp Leaders) చేస్తున్న విమర్శలపై ట్విట్టర్ వేదికగా ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మత్స్యకారుల(Fishermen) హక్కులను కాలరాసిన జగన్‌కు వారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. హార్బర్ల అభివృద్ధికి రాష్ట్ర వాటా ఉపయోగించకపోగా కేంద్రం వాటా రూ.128 కోట్లను పక్కదారి పట్టించిన ఘనుడు జగన్ అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ రూ.128 కోట్ల బకాయిలను విడుదల చేసి కేంద్రం నుంచి వచ్చే ఇతర సబ్సిడీలను కాపాడిందని తెలిపారు. వేట నిషేధ భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచి లక్షలాది కుటుంబాలకు కూటమి ప్రభుత్వం భరోసానిచ్చిందన్నారు. ఒకే ఏడాదిలో రూ.242 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించి తమ నిబద్ధతను చాటుకున్నామని పేర్కొన్నారు. డీజిల్ సబ్సిడీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ వేలాది పడవలకు లీటరుకు రూ.9 సబ్సిడీ అందిస్తున్నామని, సామాజిక భద్రతా పింఛనును రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచి ఆర్థిక భద్రతను బలోపేతం చేశామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

వాళ్లందరికీ న్యాయం చేశాం..

‘‘గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెండింగ్‌లో ఉన్న మత్స్యకారుల ప్రమాద మరణ పరిహారం క్లెయిమ్స్ క్లియర్ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేశాం. ఇందులో భాగంగా 2024-25లో రూ.3.15 కోట్లు, 2025-26లో రూ.5.65 కోట్లు చెల్లించాం. ​మత్స్యకారుల డిమాండ్ మేరకు 2015-16లోనే 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రస్తుతం ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.3,328.48 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ట్రాన్స్పాండర్లు, కృత్రిమ రీఫ్స్, చేప పిల్లల విడుదల, డీప్ సీ ఫిషింగ్ పడవల పంపిణీ వంటి కార్యక్రమాలతో మత్స్య రంగానికి కొత్త ఊపునిస్తున్నాం. ​ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణంలో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని చెరిపివేసి పనులను పరుగులు పెట్టిస్తున్నాం. నిజాలు దాచిపెట్టి అబద్ధాలు ప్రచారం చేయడం జగన్‌కు అలవాటు. మత్స్యకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది.’’ అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Next Story