- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాది రైతు సంక్షేమ ప్రభుత్వం.. పొగాకు, కోకో, మామిడి ఆదుకుంటాం : మంత్రి
by Bhoopathi Nagaiah |
మా ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, సీఎం రైతులు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

X
దిశ ప్రతినిధి, బాపట్ల: మా ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం సంతమాగులూరులో బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది పొగాకు, కోకో, మామిడి అధిక దిగుబడి - రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పొగాకు కొనుగోలుకు రూ.270 కోట్ల నిధులు కేటాయించామని, కిలోకు రూ.4 ఇచ్చి మామిడి రైతులను ఆదుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
Next Story






