- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గదిలో కూర్చోవడం కాదు.. చర్చకు రా..?: జగన్‌కు అచ్చెన్న సవాల్
మాజీ సీఎం జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు...

దిశ, వెబ్ డెస్క్: మొంథా తుపాను(Montha Cyclone) బీభత్సంతో సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే పంటల బీమాపై సోషల్ మీడియాలో కొందరు వైసీపీ(Ycp) నేతలు, కార్యకర్తలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరులో పర్యటించిన ఆయన జగన్‌పై మండిపడ్డారు. ప్రజలు కష్టాల్లో ఉంటే వైఎస్ జగన్(Ys Jagan) మాత్రం గదిలో కూర్చుని దుష్ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం విమానం లేనందునే జగన్ బెంగళూరు నుంచి రాష్ట్రానికి రావడంలేదని విమర్శించారు. పంటల బీమాపై జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని తెలిపారు. టెలికాన్ఫరెన్స్‌లో జగన్ చేసిన వ్యాఖ్యలకు చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. గత ప్రభుత్వం ఏం చేసింది.. కూటమి సర్కార్ ఏం చేసిందనేదానిపై వాస్తవ నివేదికలతో చర్చకు వస్తామని ఛాలెంజ్ చేశారు. మామిడి రైతులను ఆదుకుంటే దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారని మంత్రి అచెన్నాయుడు మండిపడ్డారు.






