- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొంథా తుపాను పంట నష్టం గడువు పొడిగింపు.. జగన్‌కు మంత్రి అచ్చెన్న సవాల్
by Naga Rani Yarlagadda |
ఏపీలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యం మొంథా తుపాను (Montha Cyclone) కారణంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యం మొంథా తుపాను (Montha Cyclone) కారణంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో తుపాను కారణంగా జరిగిన పంటనష్టం నమోదుకు మరో రెండ్రోజులు గడువు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Atchennaidu) తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఈ-క్రాప్ (E-Crop) నమోదు 100 శాతం జరిగిందని, తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇక పంట నమోదు గురించి వైఎస్ జగన్ (YS Jagan) చెప్తున్నవి పచ్చి అబద్ధాలన్నారు. ఆయనకు నచ్చిన ప్రాంతానికి వస్తే.. తాను కూడా అక్కడికే వచ్చి ఈ-క్రాప్ నమోదు జరిగిందో లేదో చూపిస్తానని సవాల్ చేశారు.
Next Story






