ప్రసన్నను పార్టీ నుంచి జగన్ సస్పెండ్ చేయాలి - హోం మంత్రి అనిత

by velandi.Saikiran |   (  Updated:2025-07-08 10:54:27  IST  )

వైసిపి పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ను ( Prasanna Kumar) సస్పెండ్ చేయాలని... డిమాండ్ చేశారు ఏపీ హోం మంత్రి

ప్రసన్నను పార్టీ నుంచి జగన్ సస్పెండ్ చేయాలి - హోం మంత్రి అనిత
X

దిశ, వెబ్ డెస్క్: వైసిపి పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ను ( Prasanna Kumar) సస్పెండ్ చేయాలని... డిమాండ్ చేశారు ఏపీ హోం మంత్రి అనిత (Home Minister Anitha). ఏపీలో ప్రస్తుతం ప్రసన్న కుమార్ ఇంటిపై జరిగిన దాడి గురించే చర్చ జరుగుతోంది. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై (Kovur MLA Prashanthi Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో... ప్రసన్నకుమార్ ఇంటిపై దాడి జరిగినట్లు వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో... వైసిపి పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు ఏపీ మంత్రి అనిత.

మహిళలంటే గౌరవం ఉంటే.. వెంటనే వైసీపీ పార్టీ నుంచి ప్రసన్నకుమార్ ను సస్పెండ్ చేయాలని జగన్ మోహన్ రెడ్డిని నిలదీశారు. మహిళల గౌరవాన్ని జగన్ కాపాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 11 సీట్లు వచ్చినప్పటికీ వైసీపీ నేతలకు సిగ్గు రాలేదని నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై.. ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా... ఫైర్ అయ్యారు.

ఇప్పటికైనా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకొని... జాగ్రత్తగా మాట్లాడాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇది ఇలా ఉండగా... నిన్న రాత్రి... వైసిపి మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ఇంటి పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు... ఈ పని చేసి ఉంటారని తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కానీ ఈ దాడి తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన పని అంటూ.. వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

Next Story