- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేర్ని నానికి బిగ్ షాక్.. లీగల్ చర్యలకు సిద్ధమవుతున్న మంత్రి అనగాని
పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై లీగల్ నోటీసులు ఇచ్చేందుకు మంత్రి అనగాని సత్య ప్రసాద్ సిద్ధమవుతున్నారు...

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani)కి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ(Ycp) హయాంలో రూ. 25 కోట్లు ఇస్తే తమ పార్టీలో చేరేందుకు ప్రస్తుత మంత్రి, అప్పటి టీడీపీ నేత అనగాని సత్య ప్రసాద్(Anagani Satya Prasad) సిద్ధమయ్యారని పేర్ని నాని చెప్పడంపై ఆయన సీరియస్ అయ్యారు. పేర్ని నాని వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నానికి లీగల్ నోటీసులు ఇస్తానని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. తన చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసన్నారు. పాస్ పుస్తకాల విషయంలో మాట్లాడేందుకు పేర్నినానికి దమ్ములేదన్నారు. సబ్జెక్టు మీద కాకుండా వ్యక్తిత్వ హననం చేసే దౌర్భాగ్యపు అలవాట్లు వైసీపీ నాయకులు, వాళ్ల అధినాయకుడికి ఉందని విమర్శించారు. పేర్నినాని పిచ్చి డాష్ అని సంబోధించారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదని మండిపడ్డారు. జగన్ కు భజన చేయడం తప్ప ప్రజాహితం కోరే పరిపాలన గతంలోనే చేయలేదన్నారు. సన్యాసం తీసుకున్న పేర్నినానికి ప్రెస్ మీట్ పెట్టే అర్హత లేదన్నారు.






