- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ద్రాక్షారామం ఘటన: మంత్రి ఆనం స్ట్రాంగ్ వార్నింగ్
ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారైనా వదిలిపెట్టమని మంత్రి ఆనం రామానారాయణ అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: ఆలయాల్లో(Temples) తప్పులు జరిగితే ఎంతటి వారైనా వదిలిపెట్టమని మంత్రి ఆనం రామానారాయణ(Minister Anam Ramanarayana Reddy) అన్నారు. నెల్లూరులో పర్యటించిన ఆయన ద్రాక్షారామం శివాలయం(Draksha Temple Shiva Temple)లో జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. ద్రాక్షారామం ఆలయ ఘటనలో నిందితుడిని పట్టుకున్నామని తెలిపారు. నంద్యాలలో నకిలీ వెండి ఆభరణాలపై విచారణకు ఆదేశించామన్నారు. ఆభరణాలు స్వామివారికి చేరేవరకు వదిలిపెట్టమని హెచ్చరించారు. ముక్కోటి రోజు భక్తుల సంఖ్య భారీగా పెరిగిందని మంత్రి ఆనం స్పష్టం చేశారు.
శివలింగం ధ్వంసం
కాగా ద్రాక్షారామం ఆలయంలో పురాతన శివలింగాన్ని రాత్రి సమయంలో ఓ వ్యక్తి ధ్వంసం చేశారు. కపిలేశ్వరస్వామి లింగాన్ని ధ్వంసం చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు స్థానిక ఫుటేజులో రికార్డు అయ్యాయి. దీని ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనను వైసీపీ తప్పు బట్టింది. ప్రభుత్వంపై విమర్శలు చేసింది. దీంతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు.






