రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల

by Vemula.Srinu Prasad |

త్వరలోనే మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు...

రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలోనే మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులు(Annadata Sukhibhav Funds Deposit) జమ చేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Minister Anam Ramanarayana Reddy) అన్నారు. ఏపీ(AP)లో రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో ఆయన మాట్లాడారు. విద్యుత్‌ ట్రూఅప్‌ చార్జీల(Electricity True-up charges)ను పూర్తిగా రద్దు చేశామని చెప్పారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.32,166 కోట్ల ట్రూప్‌అప్‌ చార్జీలను వసూలు చేసిందన్నారు. ఇక నుంచి ట్రూఅప్‌ చార్జీల భారం ప్రజలపై వేయకుండా తమ ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి రూ.4497 కోట్ల ట్రూఅప్‌ చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. తిరుపతి రీజియన్‌ పరిధిలో 1551.69 కోట్ల మేర ప్రజలకు లబ్ధి చేకూరుతోంది. విద్యుత్‌చార్జీలను కూడా తగ్గించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలం అన్నారెడ్డిపాలెం, చేజర్ల మండలం పెరుమళ్లపాడుకు నూతన సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని మంత్రి ఆనం తెలిపారు. పెరుమాళ్లపాడులోని పురాతన శివాలయం పునర్నిర్మానికి రూ. 1.50 కోట్లు నిధులు మంజూరు చేశామని, మంచి శుభ ముహూర్తం చూసి పనులు ప్రారంభిస్తాని చెప్పారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తూ రామరాజ్య స్థాపనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి ఆనం తెలిపారు.

Next Story