బద్వేల్‌కు తరలిపోయిన కంపెనీ: మంత్రి ఆనం ఫైర్

by Vemula.Srinu Prasad |

నంద్యాల జిల్లా సోమశిల ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని పెన్నా నదిలోకి మంత్రి ఆనం విడుదల చేశారు. ..

బద్వేల్‌కు తరలిపోయిన కంపెనీ: మంత్రి ఆనం ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా ఆత్మకూరు(Atmakuru)లో ఏర్పాటు చేయాల్సిన కంపెనీ కడప జిల్లా బద్వేల్‌(Badvel)కు తరలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది. వైసీపీ(Ycp) నేతలపై టీడీపీ(Tdp) శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా(Nellore District)కు కూటమి ప్రభుత్వంలో తాగు, సాగు నీరు అందించలేకపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇందుకు టీడీపీ నాయకులు సైతం స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపుతూ విమర్శలు కురిపిస్తున్నారు.

తాజాగా నంద్యాల జిల్లా సోమశిల ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని పెన్నా నదిలోకి మంత్రి ఆనం విడుదల చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి మేకపాటి రాజమోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కృష్ణాపురం దగ్గర నవోదయ స్కూలు ఏర్పాటుకు భూమి ఇచ్చి వైసీపీ నేతలు మూడింతల ప్రభుత్వ భూమిని తీసుకున్నారని ఆరోపించారు. నియోకవర్గంలో చెరువులను చెడగొట్టి రైతులకు నీరు లేకుండా చేశారని మండిపడ్డారు. రైతుల హక్కులను హరించే చట్టాన్ని తీసుకొచ్చి వారిని నాశనం చేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాలను రద్దు చేశామని తెలిపారు. గత 20 ఏళ్లలో ఉదయగిరి, మర్రిపాడు మండలాలకు మేకపాటి కుటుంబం గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. సోమశిల హైలెవల్ కెనాల్ పనుల్లో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చెప్పారు.

Next Story