- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖనిజ సంపద దోచినోళ్లకు పరామర్శా.. జగన్‌పై మంత్రి ఆనం ఫైర్
మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఈనెల 31న నెల్లూరులో పర్యటించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఈనెల 31న నెల్లూరులో పర్యటించనున్నారు. మొదట ఆయన నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న కాకాణి గోవర్దన్ రెడ్డి (Kakani Govardhan Reddy) తో ములాఖత్ కానున్నారు. ఆ వెంటనే మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించనున్నారు.
ఈ క్రమంలోనే జగన్ నెల్లూరు పర్యటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Aanam Ramnarayana Reddy)సెటైర్లు వేశారు. ఖనిజ సంపద దోచుకున్న సహచరులను పరామర్శించేందుకే జగన్ నెల్లూరు పర్యటన అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ అరాచకం జరిగినా.. అక్కడకు వెళ్లి తన వాళ్లను పరామర్శిస్తుండటం సిగ్గుచేటని కామెంట్ చేశారు. ఓ వైపు ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడుతుంటే మరోవైపు పర్యటనల పేరుతో జగన్ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. అయితే, జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులోకి అనుమతి ఉన్నోళ్లకే ప్రవేశం ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. జగన్ పర్యటన సందర్భంగా బైక్ ర్యాలీలు, రోడ్‌షోలు, ప్లకార్డులు, రెచ్చగొట్టే నినాదాలు, బ్యానర్లు ప్రదర్శించకూడదనే ఆంక్షలు విధించారు.






